భారతదేశం, జూలై 4 -- నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో వంట పోటీలో రిజల్ట్ కోసం చంద్రకళ, శాలిని వెయిట్ చేస్తుంటారు. శ్యామల, జగదీశ్వరి ముంత మసాలాను టేస్ట్ చేస్తారు. ముంత మసాలా, శాండ్ విచ్ రెండు బాగున్నాయని చెప్తారు. ఇద్దరూ విన్ అయ్యారని శ్యామల అంటుంది. ఈ పోటీ టై అయిందని చెప్తుంది. నెక్ట్స్ టాస్క్ చెప్పే వరకూ రిలాక్స్ అవండని శ్యామల అంటుంది.

తర్వాతి టాస్క్ మాత్రం నేనే గెలుస్తా అని చంద్రకు సవాలు విసురుతుంది శాలిని. బెడ్ రూమ్ లోకి వచ్చిన చంద్రకళ.. ఏంటీ బావ నేను గెలవలేను అనుకున్నావా అని విరాట్ ను అడుగుతుంది. అంతగా టచ్ లేకపోయినా శాలిని నీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది, నువ్వు ఓడిపోవాలని కోరుకుంటున్నా అని విరాట్ అంటాడు. ప్రతిక్షణం కోపంతో తలుచుకుంటా అని విరాట్ అంటే.. ఎలా అయితే ఏంటి బావా తలుచుకుంటున్నావ్ కదా హ్యాపీ అని చంద్ర అంటుంది.

విరాట్ కు ఎక్క...