Hyderabad, మే 10 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో చంద్రకళకు విరాట్ తాళి కడతాడు. ఇప్పుడు ఇది నేను మీ పెద్దనాన్నకు వేస్తున్న శిక్ష అని చెబుతాడు. ఇప్పుడు పరువు, మర్యాదలతో గౌరవంగా బతకమని, ఇప్పుడు మీ పెద్దనాన్న మొహాన్ని ఊరిలో చూపించమని విరాట్ అంటాడు.

ఏంటీ ఇలా చేశారు విరాట్ సర్. పెద్దనాన్న మీద కోపంతో నాకు తాళి కట్టడం ఏంటని అడుగుతుంది. ఇదే మీ కుటుంబానికి, మీరు చేసిన ద్రోహానికి శిక్ష అని విరాట్ అంటాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా చంద్రకళ మెడలో తాళికట్టడం చూసి అవాక్కై చూస్తుంటారు. ఆ తర్వాత గుడి నుంచి విరాట్ వెళ్లిపోతాడు. చంద్రకళ మాత్రం గుడి మెట్ల మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది.

విరాట్ తాళి కట్టడంపై బాధపడుతూ దిగాలుగా కూర్చుని ఉంటుంది చంద్రకళ. మెడలో తాళితో చంద్రకళ గుడిలో ఏకాంతంగా కూర్చొని బాధపడుతుంటే రోడ్డు మీద విరాట్ వెళ్లిపోవడాన్ని చూపిస్తు...