Hyderabad, మే 30 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో ఏం దొరకలేదని, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని, సారీ చెప్పి ఐటీ రైడ్స్ ఆఫీసర్స్ వెళ్లిపోతారు. రూమ్‌లోకి వెళ్లి బ్యాగ్ చూస్తే కనిపించదు. దాంతో డబ్బు ఏమైందని అంతా అడుగుతారు. డబ్బు ఎలా మిస్ అయిందని అనుకుంటారు. అందరం ఉన్నాం కానీ, కొత్తగా వచ్చిన మనిషి లేదుగా చంద్రకళ తీసిందని శాలిని అంటుంది.

కచ్చితంగా చంద్రకళ తీసి ఉంటుందని కామాక్షి ఉంటుంది. అనసవరంగా చంద్రకళ మీద నిందలు వేస్తారు అని క్రాంతి సపోర్ట్ చేస్తాడు. చంద్ర గురించి నీకు తెలియదని శ్రుతి అంటుంది. ఇదంతా ఎందుకు ముందు కాల్ చేయు అని విరాట్ అంటే.. క్రాంతి కాల్ చేస్తాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో చంద్రకళనే డబ్బు తీసిందని గట్టిగా వాదిస్తారు శాలిని, కామాక్షి, శ్రుతి.

డబ్బు తీసింది చంద్ర అని మీరైనా నమ్ముతున్నారా. మీ తమ్ముడిలాగే సపోర్ట్ చేస...