Hyderabad, మే 23 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి ఇంట్లో చంద్రకళకు జరుగుతున్న అవమానాలు, ద్వేషాలు చూసి క్రాంతి బాధపడుతాడు. చంద్రకళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు. నాన్నకు జరిగిన యాక్సిడెంట్, జరిగిన వీడియో చూపించకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇంత కష్టపడే అవసరం ఉండేది కాదు వదిన అని క్రాంతి బాధపడుతూ అంటాడు.

ఇందులో నీ తప్పేమి లేదు క్రాంతి. అంతా విధి ప్రకారమే జరుగుతుంది. నేను కూడా వాళ్లు అలా చేస్తారని అనుకోలేదు. మా పెద్దనాన్నను నేను మార్చగలను అనుకున్నాను. ఆయన చెప్పిన మాటలు నమ్మాను. నమ్మి మోసపోయాను. ఇంట్లోవాళ్లంతా పెద్దనాన్న మాటలతో మోసపోయారు. కానీ, మనసులో ఇంతపెద్ద కుట్ర పెట్టుకుని వస్తారని అనుకోలేదు. అయినా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. ఇందులో నా తప్పేం లేదని అత్తయ్య వాళ్లు తెలుసుకుంటారు అని చంద్రకళ అంటుంది.

చంద్రకళ, క్రాంతి మాట్లాడుకున...