Hyderabad, మే 19 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కాఫీలో శాలిని విషం కలుపుతుంది. ఆ కాఫీని చంద్రకళ తాగుతుంది. మరోవైపు విరాట్‌కు క్లైంట్ అర్జంట్‌గా ఫైల్ పంపించమని అడుగుతాడు. ఆ ఫైల్‌ను చంద్రకళకు అప్పగించాను కదా అని అనుకున్న విరాట్ ఆ ఫైల్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. మిస్ కమ్యునికేషన్ గ్యాప్ వల్ల పంపండం లేట్ అయిందని, వెంటనే ఆ ఫైల్ పంపిస్తానని విరాట్ చెబుతాడు.

చంద్రకళకు ఆ పని అప్పగించాను. వెళ్లిపోయేముందు పెండింగ్ పనులు పూర్తి చేసి వెళ్లాలి కదా అని చంద్రకళపై చిరాకు పడతాడు. ఆ ఫైల్ ఎక్కడుందో ఏంటో అనుకుని చంద్రకళకు కాల్ చేస్తాడు విరాట్. కానీ, చంద్రకళ ఫోన్ లిఫ్ట్ చేయదు. మరోవైపు చంద్రకళ బెడ్ రూమ్‌కు వెళ్తుంది. సంతోషంగా బెడ్ రూమ్‌లోకి వెళ్లిన చంద్రకళకు అకస్మాత్తుగా తల తిరినట్లు అవుతుంది.

తల పట్టుకుని అటు ఇటు తూగుతుంది. తర్వాత ఒక్కసారిగా కళ్లు ...