Hyderabad, మే 17 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో తేరగా తింటున్నాను అని అన్నారుగా మా శ్రీవారు అని పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నాను అని చంద్రకళ చెబుతున్నాను. అంటే ఏదైనా జాబ్ చేయాలిగానీ పచ్చళ్ల బిజినెస్ ఏంటీ చీప్‌గా అని శాలిని అంటుంది. అది లేనివాళ్లు చేస్తారు అని శ్రుతి అంటుంది. అయితే, మీరు అదే చేయాలిగా అని చంద్రకళ కౌంటర్ వేస్తుంది.

ఏంటా తలపొగరు అని విరాట్ అంటాడు. మాకు అన్నయ్య ఉన్నాడు అని కామాక్షి అంటుంది. అన్నయ్య అనేది రక్త సంబంధం. అది కాకూండా నాది అనేది ఏముంది అని తాళి చూపిస్తూ అంటుంది చంద్రకళ. లేనివాళ్లు లేనివాళ్లు అని మాట్లాడటానికి స్పేస్ లేదని గట్టిగానే అంటుంది చంద్రకళ. అయినా నువ్ ఇది చేయడం చిన్నచూపు అవుతుంది. నేను ఒప్పుకోను అని విరాట్ అంటాడు.

ఒప్పుకోకపోవడానికి మీరెవరు బావగారు. ఇది ఆఫీస్ కాదు. నన్ను ఆఫీస్ నుంచి నాన్సెన్స్ ...