Hyderabad, మే 16 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళకు సుభద్ర కాల్ చేసి సారే గురించి చెబుతుంది. ఇప్పుడు సారే తెస్తే ఇంట్లో మరింత గొడవ అవుతుందమ్మా అని చంద్రకళ అంటుంది. ఏమైందమ్మా అని సుభద్ర అడుగుతుంది. విరాట్ బావ నన్ను జాబ్ నుంచి తీసేశారు అమ్మా అని చెబుతుంది చంద్రకళ.

అయ్యో అవునా.. అలా ఎందుకు చేశారు. నేను వచ్చి ఇంట్లో మాట్లాడనా అని సుభద్ర అంటుంది. నువ్వేం వచ్చి మాట్లాడకు. ఏం చేయకు. నేను చూసుకుంటాను అని చంద్రకళ చెబుతుంది. ఇక తర్వాత ఇంట్లో అంతా భోజనం చేయడానికి రెడీ అవుతారు. ఇంట్లో శాలిని తప్ప మిగతా అంతా భోజనం చేస్తుంటారు.

చంద్రకళ చేసిన దానికి కోపంతో రగిలిపోతుంది శాలిని. దీనికి సరైన గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. ఇక చంద్రకళ మాత్రం తినకుండా విరాట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. విరాట్ బావ వచ్చేకా తాను భోజనం చేస్తానంటుంది. భర్త వచ్చి తిన...