Hyderabad, మే 15 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతిని అన్‌ఫిట్ అంటూ శాలిని ఫైర్ అవుతుంది. దాంతో చంద్రకళ కలుగ జేసుకుని క్రాంతి నీకు తాళి కట్టిన భర్త. మాటలు జాగ్రత్తగా మాట్లాడు అని అంటుంది. నాలుక కంట్రోల్‌లో ఉంచుకో అని చెబుతుంది. నా భర్తను అంటే నీకేంటీ అని శాలిని అంటుంది.

ఈ ఇంటి పెద్ద కోడలిని. ఈ ఇంటి మర్యాదకు భంగం కలిగితే ఊరుకోను అని చెప్పేదాన్ని. భర్తకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసా నీకా. ఏదైనా భార్యాభర్తలు ఇద్దరూ తప్పు భరించాల్సిందే. అసలు ఆఫీస్ పెట్టిందే నీ వల్ల. క్రాంతి మెతక మనిషి అని తెలియదా. నువ్వే కదా సపోర్ట్ చేయాల్సింది. అలాంటిది తప్పంతా నీదే అని ముందుకు తోస్తున్నావ్ అని చంద్రకళ అంటుంది.

తర్వాత కావాలని చేస్తే తప్పు. మనకు తెలియకుండా జరిగితే మన తప్పు ఎంతమాత్రం కాదు. కాబట్టి మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మాట పడాల్సిన అంత అవసరం ...