భారతదేశం, ఫిబ్రవరి 9 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 9 ఎపిసోడ్ లో.. క్రాంతి నీ మనసులో ఉన్న బాధ నీతో ఇలా మాట్లాడిస్తోంది. ప్రేమను నిరూపించుకునేందుకు ఈ అన్నయ్యకు ఒక్క అవకాశం ఇవ్వురా అని విరాట్ అడుగుతాడు. శాలినికి ఒక అవకాశం ఇచ్చా. తను మారి నాకు సపోర్ట్ గా నిలుస్తుందని క్రాంతి చెప్తాడు.

నువ్వు రియలైజ్ అయ్యావని నీకు అవకాశం ఇచ్చా. కానీ నువ్వు దాన్ని వాడుకుని నన్ను మోసం చేశావ్. నాకు సపోర్ట్ గా ఉన్నట్లు నటిస్తూనే ముందడగు వేయకుండా అడ్డుకున్నావు. నేను మాత్రం నిన్ను ఇంకోసారి నమ్మను. రేపు వెన్నుపోటు పొడిస్తే భరించలేను అన్నయ్య. అందుకే నా బిజినెస్ విషయంలో నువ్వు ఇన్వాల్స్ అవొద్దని విరాట్ తో క్రాంతి అంటాడు.

నా మాటలు క్రాంతి మీద బాగానే పనిచేశాయి. మొత్తానికి క్రాంతి నా గుప్పిట్లోకి వచ్చాడని శాలిని అనుకుంటుంది. అప్పుడే చంద్రకళ వచ్చి శాలిని మీద ఫైర్ ...