భారతదేశం, ఫిబ్రవరి 24 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో.. గూండాలతో విరాట్ ఫైట్ చేస్తాడు. రౌడీలను చితక్కొడతాడు. విరాట్ కు కూడా దెబ్బలు తగులుతాయి. స్పృహ‌ కోల్పోయి పడిపోతాడు. గుడిలో ఉన్న వాళ్లు విరాట్ ను లేపుతారు. అప్పుడే విరాట్ కు చంద్రకళ నుంచి కాల్ వస్తుంది.

నాకు ఇక్కడే లేట్ అవుతుంది. శివుడికి అభిషేకం చేయిస్తున్నానని.. శాలిని, క్రాంతితో ఇంట్లో పూజ కంప్లీట్ చేయించమని చంద్రకళకు విరాట్ చెప్తాడు. మరోవైపు శ్రుతితో మాట్లాడుతూ కామాక్షిపై రాజ్ పొగడ్తలు కురిపిస్తాడు. అప్పుడే అప్పుల అప్పారావు ఫోన్ చేసి జల్ రాజ్ ను అప్పు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. ఇప్పుడు నా రేంజే వేరు అని రాజ్ బిల్డప్ ఇస్తాడు.

బావ అక్కడ అభిషేకం చేస్తున్నారు కదా. ఇక్కడ క్రాంతి, శాలిని కలిసి పూజ చేస్తారని చంద్రకళ అంటుంది. నేను శాలినితో కలిసి పూజ చేయను. ఇలాంటి వాళ్లతో...