భారతదేశం, ఫిబ్రవరి 16 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 16 ఎపిసోడ్ లో.. చక్కెర తిన్నప్పటి కంటే పాయసం తిన్నప్పుడు కలిగే ఫీల్ వేరు కదా. మరి చక్కెర తింటానంటావేంటీ? ఈ ఒక రోజు ఆగు. రేపు టైమ్ తీసుకుని ప్రిపేర్ అవుదామని శోభనం గురించి విరాట్ తో చంద్రకళ చెప్తుంది.

చంద్రకళను క్షమించమని శ్యామల కోరుతుంది. ఎదుటివాళ్లు తప్పు చేసినప్పుడు నిలదీయడమే కాదు. మన తప్పు ఉందని తెలిసినప్పుడు క్షమాపణ ఆడగడమే పెద్దరికం అనిపించుకుంటుంది. నువ్వు ఆ వరదరాజులు కూతురు అని తెలిసిన తర్వాత ఈ ఇంటి నాశనం కోరి వచ్చావని అనుకున్నా. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని శాలిని నిందలన్నీ నీపై వేసింది. నేను ఎన్నో అనరాని మాటలు అన్నాను. అవి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని శ్యామల ఎమోషనల్ అవుతుంది.

పిన్ని అని శ్యామలను చంద్రకళ హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకు మీ ప్రేమ గుర్తుంటుంద...