భారతదేశం, ఫిబ్రవరి 12 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 12 ఎపిసోడ్ లో.. డాక్టర్ దగ్గరకు వెళ్లి శాలిని కొన్ని ఇన్సిడెంట్లు మర్చిపోవడం కోసం ట్యాబ్లెట్స్ వాడిందా? నిజం చెప్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? అని క్రాంతి అడుగుతాడు.

శాలిని అడిగిందని ఆ ట్యాబ్లెట్స్ తెప్పించా. మీ నాన్న గతం మర్చిపోవాలని ఎవరికీ తెలియకుండా ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఆయన కోలుకుంటే చంద్రకళ నిర్దోషి అని చెప్తారని, అప్పుడు చంద్ర ఇంట్లోనే ఉండి తన పగ నెరవేర్చుకోకుండా అడ్డుపడుతుందని అలా చేసింది. మీ నాన్నలో కదలిక వచ్చినప్పుడు ఆయనను తల మీద కొట్టింది శాలినినే. ఆయనకు ట్రీట్మెంట్ అందకుండా చూసిందని డాక్టర్ చెప్పడంతో క్రాంతి షాక్ అవుతాడు.

రఘురాం కోలుకుంటే శాలిని తప్పులు బయటపడతాయని మెడిసిన్ మార్చిందని డాక్టర్ చెప్తాడు. శాలిని ఇన్ని తప్పులు చేసిందా? తన తప్పులకు చంద్ర వదినను నిందించ...