భారతదేశం, ఫిబ్రవరి 11 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 11 ఎపిసోడ్ లో.. క్రాంతి ల్యాప్ టాప్ వాడి అతని అకౌంట్ నుంచి డాక్టర్ అకౌంట్ కు చంద్రకళ రూ.10 లక్షలు పంపిస్తుంది. శాలిని ఈ రోజుతో నీ ఆటలకు ఫుల్ స్టాప్ పడబోతుందని చంద్ర అనుకుంటుంది.

శాలిని రూమ్ లోకి వచ్చి గన్ తీసి బ్యాగ్ లో పెట్టుకుంటుంది. డాక్టర్ కు కాల్ చేసి కలిసేందుకు వస్తున్నానని చెప్తుంది. ఇదంతా చంద్రకళ చూస్తుంది. మనం క్రాంతిని ఆ గైనకాలజిస్ట్ ఇంటికి వెళ్లేలా చేస్తే మన ప్లాన్ సక్సెస్ అయినట్లేనని చంద్రతో విరాట్ అంటాడు. క్రాంతి రాగానే విరాట్, చంద్ర డ్రామా స్టార్ట్ చేస్తాడు.

అకౌంట్ నుంచి రూ.10 లక్షలు ట్రాన్స్ ఫర్ అయినట్లు ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి క్రాంతి షాక్ అవుతాడు. మరోవైపు ఏంటి చంద్ర నువ్వు అనేది, శాలినికి ప్రాబ్లం ఉండటం ఏంటీ? అని విరాట్ గట్టిగా అరుస్తాడు. శాలినికి ప్రాబ్లం ఉం...