Hyderabad, అక్టోబర్ 12 -- నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రఘురాంను అమెరికా డాక్టర్‌కు చూపించేందుకు హాస్పిటల్‌కు రెడీ అవుతారు విరాట్, చంద్రకళ. శాలినికి చేయి కట్ అవడంతో క్రాంతి ఇంట్లోనే ఉంటాడు. రఘురాం రిపోర్ట్స్ తీసుకొస్తానని ఇంట్లోకి వెళ్లి వస్తుంది చంద్రకళ. ఇంతలో చంద్రకళకు అర్జున్ కొత్త మేనేజర్ మనోహర్ ఫోన్ చేస్తాడు.

నేను మనోహర్‌ను మీ కంపెనీలో మేనేజర్‌గా కొత్తగా చేరాను. పచ్చళ్ల ప్రొడక్ట్ గురించి మీతో మాట్లాడాలి. అర్జున్ గారు ఏదో అర్జంట్ వర్క్ ఉండి బయటకెళ్లారు. నాకు ఇక్కడ కొత్త కదా. ఏదైనా ఉంటే మీ హెల్ప్ తీసుకోమన్నారు. మీరు ఇక్కడికి రావాలి. మీతో ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి అని మనోహర్ అంటాడు.

దాంతో ఆలోచనలో పడిపోతుంది చంద్రకళ. నేను మా మావయ్యను అర్జంట్‌గా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. తర్వాత వస్తాను అని చంద్రకళ అంటుంది. హాస్పిట...