భారతదేశం, డిసెంబర్ 14 -- నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో చంద్రకళ బ్యాంక్‌లో వేయమన్న డబ్బు తీసుకుని పెళ్లికూతురిలా రెడీ అవుతుంది శ్రుతి. కూతురుని చూసి దిష్టి చుక్క పెట్టి మరి పంపిస్తుంది తల్లి కామాక్షి. శ్రుతి గుడికి వెళ్తుంది. జాలి రాజ్, అతని తల్లి కూడా వస్తారు. పెళ్లికొడుకులా రాజ్ రెడీ అయి వస్తాడు.

సీక్రెట్‌గా శ్రుతి పెళ్లి

శ్రుతి గుడిలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటుందని కామాక్షికి ఫోన్ వస్తుంది. అది తెలిసి షాక్ అవుతుంది కామాక్షి. అందరిని పిలిచి గోల చేస్తుంది కామాక్షి. అంతా వచ్చి ఏమైంది అని అడుగుతారు. శ్రుతి పెళ్లి చేసుకుంటుందట అని ఏడుస్తూ కామాక్షి అందరికి చెబుతుంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

పెళ్లి ఏంటీ, ఎవరిని చేసుకుంటుంది, అసలు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకునేంతగా ఏం జరిగింది అని అంతా అనుకుంటారు. ఏమైందో త...