Hyderabad, సెప్టెంబర్ 21 -- నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో జగదీశ్వరి, చంద్రకళ వంటింట్లో ఉంటారు. అది చూసిన శాలిని డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇద్దరు పడిపోవాలి అని అనుకుంటుంది. ఇంతలో క్రాంతి వస్తే పిలిచి రొమాంటిక్‌గా బిహేవ్ చేస్తుంది శాలిని.

శాలిని రెడ్ రోజ్ తీస్తే ఇప్పుడు ప్రపోజ్ చేయాల ఏంటీ అని క్రాంతి అంటాడు. అబ్బా ఆశ.. లేదు నా తలలో పెట్టు అని శాలిని రొమాంటిక్ పదాలతో చాలా ప్రేమ ఉన్నట్లు డ్రామా చేస్తుంది. అదంతా చూసిన చంద్రకళ సంతోషంగా మురిసిపోతుంది. కానీ, జగదీశ్వరి మాత్రం చిరాకు పడుతుంది.

తర్వాత చంద్రకళకు అర్జున్ కాల్ చేస్తాడు. లాస్ట్ వీక్ పంపించిన పచ్చళ్లన్ని పాడైపోయాయి చంద్రగారు. స్టాక్ మొత్తం వెనక్కి వచ్చేసింది అని అర్జున్ అంటాడు. దాంతో చంద్రకళ ఉలిక్కిపడుతుంది. ఏం చేబుతున్నారు అర్జు...