భారతదేశం, డిసెంబర్ 7 -- నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రఘురాంను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ సౌండ్‌తో డైవర్ట్ అయిన రఘురాం డాక్టర్ రూమ్‌లోకి వెళ్తాడు. కోట్ వేసుకుని డాక్టర్ చైర్‌లో కూర్చుంటాడు. ఇంతలో ఒక పేషంట్ కడుపు నొప్పి డాక్టర్ అంటూ వస్తాడు. అది విని నేను ఇక్కడ డాక్టర్‌నా. నాకు ఈ విషయం తెలియదే అనుకుంటాడు రఘురాం.

పేషంట్ నొప్పితో అవస్థలు పడటంతో రఘురామే డాక్టర్‌ అనుకుని ట్రీట్‌మెంట్ ఇస్తాడు. మరోవైపు శాలినితో ప్రెగ్నెన్సీ డ్రామా ఆడిన డాక్టర్ కోసం విరాట్, చంద్రకళ బయట ఎదురుచూస్తుంటారు. పేషంట్ వెళ్లగానే లోపలికి వెళ్తారు. ఏం కావాలి, ఏంటీ సమస్య అని లేడి డాక్టర్ అడుగుతుంది.

మీరే సమస్య, వల్లే పెద్ద సమస్య ఏర్పడింది, మీరే సరిచేయాలని చంద్రకళ అంటుంది. దాంతో డాక్టర్ కోప్పడుతుంది. ఏంటీ మీరు మాట్లాడేది. నేను సమస్య ఏంటీ. అసలు ఎవరు ...