భారతదేశం, నవంబర్ 8 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మల్లెపూలు, స్వీట్స్ తీసుకొస్తాడు విరాట్. శ్రుతి వచ్చి స్వీట్స్ ఇవ్వమంటే విరాట్ ఇవ్వడు. ఇవి నీకోసం కాదు మాకోసం అని విరాట్ అంటాడు. ఆ మాటలు విన్న కామాక్షి వచ్చి శ్రుతిని తీసుకెళ్లిపోతుంది. రాత్రి తొమ్మిదిన్నరకు మంచి ముహుర్తం ఉందట. ఫ్రెషప్ అయి రూమ్‌కు రా అని విరాట్ అంటాడు.

అది విన్న శాలిని చిరాకుగా వెళ్లిపోతుంది. అది చూసిన చంద్రకళ శాలిని మాట్లాడుతుంది. పూర్తి నిజం బయటపడినప్పుడు నీ జీవితం నట్టేట మునుగుతుంది. నిజం తెలిస్తే క్రాంతి ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచించు. రెండోసారి మోసం చేసినందుకు, తండ్రిని చంపాలని చూసినందుకు ఏం చేస్తాడో గుర్తు చేసుకో అని చంద్రకళ అంటుంది.

దాంతో తనను క్రాంతి మెడ పట్టి గెంటేసినట్లు, ఈ ఇంటి ముఖం మరోసారి చూస్తే కాటికి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్లు ఊహించుకుంటుం...