భారతదేశం, నవంబర్ 7 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం గతం మర్చిపోయారని డాక్టర్ చెబుతాడు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకురాకుండా చూసుకోండి అని డాక్టర్ వెళ్లిపోతాడు. పరిస్థితి అర్థమైందిగా అంతా చూసుకుని మెదలండి అని జగదీశ్వరి అంటుంది. చంద్ర నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోకి వెళ్లు అని విరాట్ అంటే ఆగమని శ్యామల అంటుంది.

నిజం ఇంకా పూర్తిగా బయటపడలేదు కాబట్టి నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని శ్యామల అంటుంది. జరిగిన యాక్సిడెంట్‌కు నాకు ఏ సంబంధం లేదని, తల మీద కొట్టింది కూడా నేను కాదని మావయ్య గారు క్లియర్‌గా చెప్పారు. కాబట్టి నా సమస్యకు పరిష్కారం దొరికింది. అసలు నిజాన్ని మెల్లిగా కనిపెడతాం. ఇక నన్ను నిందించడం, ఇంట్లోంచి వెళ్లమనడానికి ఎవరికి హక్కు లేదని చంద్రకళ అంటుంది.

అవునమ్మా ఇది నీ ఇల్లు, దర్జాగా ఉండొచ్చు అని రఘురాం అ...