భారతదేశం, నవంబర్ 6 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 6 ఎపిసోడ్ లో ఏదో ఒక రోజు ఈ ఇంటి నుంచి పిలుపు వస్తుందనే నమ్మకంతో వెళ్తున్నానని రఘురాంతో చెప్తుంది చంద్రకళ. మీ నోటితో తప్పు లేదని చెప్పించాలనుకున్నా. ఆ రోజు సీతారాములు వనవాసం చేశారు. ఈ రోజు నేను ఒంటరిగా చేయాలని ఉందేమోనని చంద్ర బాధపడుతుంది. ఇక బయల్దేరొచ్చు అని కామాక్షి అంటుంది.

చంద్ర లగేజీ పట్టుకుని గడప దాటబోతుంది. అప్పుడే ఆగు చంద్ర అని రఘురాం అనడంతో అందరూ షాక్ అవుతారు. రఘురాం లేచి నిల్చుంటాడు. అమ్మ చంద్రా, నువ్వెందుకమ్మా గడప దాటడం. నువ్వు ఏ తప్పు చేశావని. చేసిన వాళ్లు ఇక్కడే ఉన్నప్పుడు ఏ తప్పూ చేయని నువ్వు ఇళ్లు వదలడం ఏంటమ్మా? అని రఘురాం అంటాడు. నాన్న నువ్వు మాట్లాడుతున్నావా? అని విరాట్ సంతోషం పట్టలేకపోతున్నాడు.

అందరూ కలిసి చంద్రకళను వదిలించుకోవాలని చూస్తున్నారా? నాకు అన్ని వినపడుతూనే ...