భారతదేశం, నవంబర్ 5 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 5 ఎపిసోడ్ లో ఫిష్ కర్రీలో విషం కలిపాను. మీరు గెస్ చేసింది నిజమే అని చెప్పగానే శ్యామల, కామాక్షి, శ్రుతి వాంతి చేసుకుంటారు. జోక్ చేశానని చంద్ర అంటుంది. చంపాలనే ఆలోచన నాకుంటే ఎప్పుడో చేసి ఉండేదాన్ని, మీరు అనుకున్నంత క్రూరమైన దాన్ని కాదని చంద్ర చెప్తుంది.

వరుసకు పిన్ని ఏమో కానీ మిమ్మల్ని అమ్మలాగే చూస్తా. అందరూ ద్వేషించిన సమయంలో మీరు నాకు కొండంత అండగా నిలిచారు. మీ కారణంగానే నా భర్త మనసు గెలుచుకోగలిగా. నా మనసులో ఎప్పుడూ మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ కోపం కొండంత అయితే ప్రేమ ఆకాశమంత అని శ్యామలను హగ్ చేసుకుంటుంది చంద్రకళ. శ్యామల కూడా ఎమోషనల్ అవుతుంది.

నాతో మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా వదిన అని పిలవడం మానలేదు. నేను నీకు గుడ్ బై చెప్పడానికి వచ్చా. అన్నదమ్ముల్లా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ గా అ...