భారతదేశం, నవంబర్ 3 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో నువ్వు చేసిన పూజ పనికి రాకుండా పోయింది. ఆ దేవుడు కూడా నీకు సపోర్ట్ గా లేడు. తట్టాబుట్టా సర్దుకోవడానికి రెడీగా ఉండమని చంద్రకళతో శాలిని అంటుంది. ఎలాగైనా నిజం బయటపెట్టి కుటుంబాన్ని కాపాడుతానని చంద్ర అంటుంది. ఇంకా రెండు రోజుల్లో, 48 గంటల్లో ఏం చేస్తావని వెళ్లిపోతుంది శాలిని.

చంద్రకళకు ఫోన్ చేస్తాడు అర్జున్. ఇంకా రెండు రోజుల డెడ్ లైన్ మాత్రమే ఉంది. మామయ్య కోలుకుని నిజం చెప్పకపోతే ఇంటి నుంచి వెళ్లాల్సి వస్తుందని చంద్రకళ చెప్తుంది. నేను వచ్చి మాట్లాడతానని అర్జున్ అంటే వద్దంటుంది చంద్ర. మా ఇంటికి వచ్చి ఉండొచ్చని అర్జున్ చెప్తాడు. కానీ రాలేనని, రెండు రోజుల్లో అవకాశం వస్తుందని చెప్తుంది చంద్ర.

శాలిని కోసం స్వీట్ చేసి తీసుకొస్తుంది జగదీశ్వరి. గది నుంచి బయటకు వచ్చి స్ట్రెస్ పెంచుకోవ...