భారతదేశం, నవంబర్ 27 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో రఘురాం, జగదీశ్వరి హోమం చేస్తుంటారు. గుడిలో గంట సౌండ్ వినపడినప్పుడల్లా డిస్టర్బ్ అవుతాడు రఘురాం. అది శాలిని కనిపెడుతుంది. ఈ పాయింట్ వాడుకోవచ్చు అనుకుంటుంది. పూజ అయిపోతుంది. అందరూ పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

ముత్తయిదువులకు వాయినం ఇచ్చి మొక్కు తీర్చుకోమ్మని చెబుతాడు పంతులు. చీరలు తీసుకురావడానికి చంద్రకళ వెళ్తుంది. వాటిని అమ్మ వారి పాదాల ముందు పెట్టమని పంతులు చెబుతాడు. దాంతో చంద్ర పెడుతుంది. చీరలపై స్ప్రే చల్లితే ఎంతదూరం ఉన్న మంట అంటుకుంటుందన్న విషయం శాలిని గుర్తు చేసుకుంటుంది. చూస్తుండగానే చీరలు అగ్నితో భగ్గుమంటాయి.

రఘురాం కంగారుపడతాడు. నువ్వు కావాలనే చేశావుగా అని చంద్రకళను నిందిస్తారు అంతా. పూజకు ఎలాంటి ఆటంకం కలిగించను అని అత్తయ్యకు మాటిచ్చాను. నేనెందుకు చేస్తాను అ...