భారతదేశం, నవంబర్ 26 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో రఘురాం గురించి వెతుకుతారు ఫ్యామిలీ మెంబర్స్. మీ ఇంట్లో వాళ్లందరూ టెన్షన్ పడుతుంటే నువ్వేంటీ కూల్ గా ఉన్నావని శ్రుతిని రాజ్ అడుగుతాడు. నాకు టెన్షన్ పడటం తెలియదని శ్రుతి చెప్తుంది. అప్పుడే రఘురాం అక్కడికి రావడంతో శ్రుతి కంగారు పడుతుంది. కానీ వీళ్లు ఎవరో తెలియనట్లు రఘురాం మాట్లాడతాడు.

శాలినిని స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పిన క్రాంతి నేను వెళ్లి వెతుకుతానంటాడు. క్రాంతిని మరో సైడ్ పంపిస్తుంది. ఓ వ్యక్తితో స్ప్రేను తెప్పిస్తుంది శాలిని. హై ఫ్లేమబుల్, చిన్న నిప్పు రవ్వ తగిలినా భగ్గున మండుతుందని ఆ వ్యక్తి చెప్తాడు. ఎంత ఆలోచించినా నాకు ఎవరు గుర్తు రావడం లేదని రఘురాం అనుకుంటాడు. జగదీశ్వరి అనే పేరున్న మరో మహిళను తన భార్య అనుకుంటాడు రఘురాం. పరాయి మగాడిని అండి అనడం నాకు నచ్చడం లేదని రఘురాం సీరి...