భారతదేశం, నవంబర్ 25 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో జగదీశ్వరి జడలో మల్లెపూలు పెడతాడు రఘురాం. అప్పుడే వదిన అంటూ శ్యామల, కామాక్షి వస్తారు. అందరిని డిస్టర్బ్ చేయడమేనా? మీ పని అని అంటాడు రఘురాం. మరోవైపు రాజ్ అప్పుల లెక్కలు వేస్తాడు. రూ.9 లక్షలు అప్పు అయిందని అమ్మతో చెప్తాడు. శ్రుతి పడిపోయింది, పెళ్లి చేసుకున్నాక అప్పు తీర్చేస్తానని అంటాడు.

శ్రుతి మంచిదో, పిచ్చిదో అర్థం కావడం లేదు. లేదంటే నీ వేషాలు కనిపెట్టేదే. అసలు ఆ ఇంద్రభవనంలో శ్రుతి యువరాణో చెలికత్తో ఎవరికి తెలుసు? నువ్వు సరైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావో లేదో చెక్ చేసుకోరా అని రాజ్ కు సరోజ సలహానిస్తుంది. అదే పని చేస్తానని రాజ్ అంటాడు.

రేపు మనం గుడికి వెళ్లకపోవడమే మంచిదనిపిస్తుంది శాలిని అని క్రాంతి అంటాడు. అత్తయ్యకు వస్తానని చెప్పి ఇప్పుడ ఇలా అంటావేంటీ అని శాలిని అడుగుతుంది. న...