భారతదేశం, నవంబర్ 22 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అందరు గుడిలో మొక్కు తీర్చుకునేందుకు అంతా ఒప్పుకుంటారు. మరోవైపు రాజ్‌ను ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, ఎలాగైనా శ్రుతి నుంచి లక్ష రూపాయలు లాగు అని తల్లి చెబుతుంది. ఎలా లాగాలి అని రాజ్ ఆలోచిస్తాడు.

మరోవైపు కొత్త డ్రెస్ కోసం తల్లిని ఐదు వేలు అడిగితే ఐదు వందలు తప్పితే ఎక్కవ లేవని కామాక్షి చెబుతుంది. ఇంతలో శ్రుతికి కాల్ చేసిన రాజ్ లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయమంటాడు. కోటీశ్వరుడివి అయిండి నన్ను అడుగుతావేంటీ అని శ్రుతి అంటుంది. డబ్బంతా ట్రస్ట్ పేరు మీద ఉంది. పర్సనల్ పనులకు తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని కవర్ చేస్తాడు రాజ్.

ఈరోజు మా డ్రైవర్ కూతురు ఎంగేజ్‌మెంట్ ఉంది. అతనికి ఇస్తానని మాటిచ్చాను. ఇవ్వకుంటే మాట పోతుంది. నువ్వు పంపిస్తావని తెలుసు. అర్జంట్‌గా పంపించు అని రాజ్ అంటాడు. స...