భారతదేశం, నవంబర్ 21 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం దగ్గరికి వెళ్లి కావాలని ఏడుస్తుంది శాలిని. ఏమైందని రఘురాం అడిగితే మీ అబ్బాయిలు ఇద్దరు గొడవ పడుతున్నారు. వాళ్లను ఆపడం నా వల్ల కావట్లేదు అని శాలిని అంటుంది. దాంతో రఘురాం కిందకు వస్తాడు. క్రాంతి, విరాట్ గొడవ పడటం చూసి షాక్ అవుతాడు రఘురాం. తండ్రిని చూసి ఆగిపోతారు.

నాకు తెలియకుండా రోజు గొడవ పడుతున్నారా. నాకోసం నటిస్తున్నారా. ఎందుకురా ఇలా చేస్తున్నారు అని.. అడుగుతాను అనుకున్నారా. నాకు తెలుసురా. ఇదంతా మీరు జగదీశ్వరిపై ప్రాంక్ చేస్తున్నారుగా. ఈ ప్రాంక్ చేస్తున్నట్లు ఉదయమే చంద్రకళ చెప్పింది అని రఘురాం అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. దాంతో ఉదయం జరిగింది గుర్తు చేసుకుంటుంది చంద్రకళ.

హమ్మయ్య నేను సర్దిచెప్పింది ఇలా ఉపయోగపడిందా అని అనుకున్న చంద్రకళ బయటకు చూశారా మావయ్య ఈ గొడవ నిజమనుక...