భారతదేశం, నవంబర్ 20 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 20 ఎపిసోడ్ లో క్రాంతి బర్త్ డే గిఫ్ట్ గా శ్యామల కవిత రాస్తుంది. క్రాంతి కోసం రాసిన కవిత కాబట్టి అతని ముందు చదివితేనే బాగుంటుంది అని కామాక్షి తప్పించుకుంటుంది. మరోవైపు శ్రుతి మామయ్యతో గొడవ గురించి ఇంటికొచ్చి రాజ్ కంగారు పడుతుంటాడు. అప్పుడే శ్రుతి కాల్ చేసి మామయ్యకు మతిమరుపు, అన్నీ మర్చిపోతాడు కంగారు పడకు అని చెప్తుంది.

క్రాంతి బర్త్ డే కోసం మొత్తం డెకరేట్ చేస్తారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అత్తయ్య అని క్రాంతి అడుగుతాడు. ఇదంతా చేసింది అత్తయ్య కాదురా మీ వదిన అని చెప్తాడు రఘురాం. క్రాంతి కేక్ కట్ చేస్తాడు. అన్నయ్యకు కేక్ పెట్టలేదు ఏంట్రా అని రఘురాం అడుగుతాడు. దూరమయ్యాడు కదా అని క్రాంతి అనగానే అందరూ టెన్షన్ పడతారు. మళ్లీ క్రాంతి, విరాట్ కవర్ చేస్తారు.

కొడుకు మెడలో రఘురాం చైన్ వేస్...