భారతదేశం, నవంబర్ 19 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 19 ఎపిసోడ్ లో నువ్వు వేస్తున్న వెధవ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? అన్నదమ్ముల మధ్య గొడవలు మామయ్య చూసేలా చేయాలని అనుకుంటున్నావు. కానీ ఏ ప్రయత్నాలు నెరవేరవని శాలినికి వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. విరాట్ ను చూసి శాలిని డ్రామా ఆడుతుంది. నా మీద వేయాల్సిన నింద నిజం చేయాలన్నిది మీ మోటో అని విరాట్, చంద్రతో అంటుంది శాలిని.

మా జీవితాలను బలి తీసుకోవాలని అనుకుంటుంది నువ్వు. ఊసరవెళ్లిలా రంగులు మారుస్తుంది నువ్వు. నీ రంగులు త్వరలోనే బయటపడతాయి చూడు అని విరాట్ కూడా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే శాలిని వాంతులు చేసుకుంటుంది. ఆమెను శ్యామల రూమ్ లోకి తీసుకెళ్తుంది. గదిలో కూర్చుని రెస్ట్ తీసుకోక ఏం చేస్తున్నావని శ్యామల అడుగుతుంది.

మీ అన్నదమ్ముల గొడవ గురించి మామయ్యకు తెలిసేలా చేస్తున్నానని చంద్రకళ అంటుంది. ...