భారతదేశం, నవంబర్ 18 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 18 ఎపిసోడ్ లో విరాట్ పై ద్వేషం పెంచేలా క్రాంతిని రెచ్చగొడుతోంది శాలిని. మీ అన్నయ్యలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని ఎక్స్ పెక్ట్ చేయలేదు. మనసులో కుట్రలు, పైకి కౌగిలింతలు అని శాలిని అనగానే విరాట్ ఇచ్చిన పూతరేకుల డబ్బాను విసిరికొడతాడు. అప్పుడే వచ్చిన జగదీశ్వరి ప్రేమతో తెప్పించినదాన్ని నేలకేసి కొట్టావేంటీ అని అడుగుతుంది. అన్నయ్య మారిపోయాడమ్మా అని క్రాంతి అంటాడు.

విరాట్ కు నీ మీద ప్రేమ లేదన్న మాట నిజం కాదురా. ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిందని ప్రేమంతా అబద్ధం అయిపోతుందా? క్రాంతి తప్పుగా ఆలోచిస్తున్నావని జగదీశ్వరి అంటుంది. నాన్నను కొట్టింది శాలిని అని అనుకుంటున్నావా? అమ్మ అని అడుగుతాడు క్రాంతి. తప్పు చేసింది ఎవరో తెలియదు. కానీ మీరు గొడవపడటం నాకు నచ్చట్లేదు. శాలిని, చంద్రకళలో ఒక్కరు నేరం చేశారన్నది...