భారతదేశం, నవంబర్ 17 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 17 ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఒక ఆట ఆడాలి. ఓడిపోయినవాళ్లు గెలిచిన వాళ్లకు ముద్దు పెట్టాలని విరాట్ అంటాడు. పులుసు ఆటలో కావాలనే ఓడిపోతావ్, నేను ఆడను అని చంద్ర అంటుంది. కానీ జెన్యూన్ గా ఆడదామని విరాట్ అనడంతో గేమ్ స్టార్ట్ చేస్తారు. ఎవరు గెలిచినా పెట్టేదే ముద్దే కదా అని విరాట్ ఉత్సాహంతో ఉంటాడు.

నువ్వు 12 సార్లు ఓడిపోయావు, నేను 13 సార్లు ఓడిపోయా. 12 ముద్దులు చెల్లు. ఒకటే పెట్టాలని విరాట్ చెంప మీద ముద్దు పెడుతుంది చంద్రకళ. మరోవైపు చంద్రను వెనకేసుకొస్తూ జగదీశ్వరి మాట్లాడటం శ్యామల, కామాక్షికి నచ్చదు. ఇంట్లో ఉన్న సమస్యకు, వాళ్ల భార్యాభర్తల బంధానికి ఏ సంబంధం లేదు. మీకు నచ్చకపోయినా సరే కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలి. మీ అన్నయ్యకు చెప్పి నీకు మంచి సంబంధం చూడమంటావా అని శ్యామలతో సరదాగా అంటుంది జగదీశ్వర...