భారతదేశం, నవంబర్ 13 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో వంటింట్లో మైదా పిండి అందుకోవడానికి శ్యామల, కామాక్షి తిప్పలు పడుతుంటే చంద్రకళ నవ్వుతుంది. కుర్చీ ఎక్కకుండా డబ్బాను తీయమని చంద్రకు చెప్తుంది శ్యామల. అప్పుడు విరాట్ ను పిలుస్తుంది. విరాట్ ఎత్తుకోవడంతో డబ్బాను తీస్తుంది చంద్ర.

చెట్లకు నీళ్లు పడుతున్న రఘురాం దగ్గరకు వస్తుంది శాలిని. ఏం గుర్తుచేసుకున్నా లాభం ఉండదు. ఒక సంఘటన వల్ల గతం మర్చిపోయిన వాళ్లకు మెడికల్ చికిత్స, గుర్తు చేసుకోవడం వల్ల గుర్తుకు రాదు. మళ్లీ తలపై దెబ్బ తగిలితేనే గుర్తుకొస్తుందని శాలిని చెప్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లందరికీ చెబుదామని రఘురాం అంటే, ఇంట్లో వాళ్లకు తెలుసు కానీ ఫిజికల్ గా హర్ట్ చేయడం ఎవరికి ఇష్టం లేదని శాలిని అబద్ధాలు చెప్తుంది.

అయితే నువ్వు నా తలపై కొట్టు అని రఘురాం అడుగుతాడు. నేను అలా చేయలేను....