భారతదేశం, నవంబర్ 12 -- నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 12 ఎపిసోడ్ లో క్రాంతి గురించి తలుచుకుంటే బాధగా ఉంది చంద్ర. శాలిని పూర్తిగా వాడి మైండ్ మార్చేసింది. నా మీద పీకల దాకా కోపం ఉందంటా. మా అన్నయ్య ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు భార్యను గుడ్డిగా నమ్మి బలైపోతున్నాడు చంద్ర. నాన్న నార్మల్ అయ్యేంతవరకూ పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారుతాయో అని విరాట్ ఎమోషనల్ అవుతాడు.

అన్నీ సర్దుకుంటాయి బావ. విండోస్ కు కర్టెన్ వేయాలి హెల్ప్ చేయమని అడుగుతుంది చంద్రకళ. జారిపోయి పడబోతుంటే చంద్రకళను పట్టుకుంటాడు విరాట్. కామాక్షి డోర్ బయట ఉండి వింటుంది. చంద్ర డోర్ తీయడంతో ఉలిక్కిపడుతుంది. కనీసం ఒక హగ్ అయినా ఇవ్వవే అని రిక్వెస్ట్ చేస్తాడు విరాట్. కానీ చంద్ర నో చెప్తుంది.

శ్యామలకు గోరింటాకు పెడుతుంది శ్రుతి. విరాట్, చంద్రలు రూమ్ లో మాట్లాడుకున్న మాటలు విన...