భారతదేశం, నవంబర్ 1 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాంను డాక్టర్‌కు చూపిస్తారు. సొమ్మసిల్లి పోయింది చెబుతాడు విరాట్. ఇంట్లో నెగెటివిటీ ఉండటం వల్లే నాన్న కోలుకోవట్లేదు అని క్రాంతి అంటాడు. జగదీశ్వరి కోపంగా చూడటంతో ఊరుకుంటాడు. ఏమైందని డాక్టర్‌ను అడుగుతుంది జగదీశ్వరి.

బీపీ రెయిజ్ అయింది. మాట్లాడించడం వల్ల నర్వ్ సిస్టమ్‌పై ప్రెజర్ పడింది. దానివల్ల ఒక్కోసారి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఇంట్లో గొడవలున్నాయని అర్థమైంది. ఆ ఎఫెక్ట్ మీ నాన్నపై పడనివ్వకండి. బలవంతంగా మాట్లాడించే ప్రయత్నించకండి. మెంటల్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటేనే ఆయన బాడీ సపోర్ట్ చేస్తుంది. ఈ సిరప్ వాడండి. ఇది నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అయి శక్తి రావచ్చు. కోలుకోవాలని పట్టుదల ఉంటే ఆయన కోలుకోవచ్చు అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

ఇప్పటివరకు జరిగింది చాలు. ఇక వదిలేయండి. ఆయన కోలుక...