భారతదేశం, డిసెంబర్ 9 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 9 ఎపిసోడ్ లో క్రాంతిని హాస్పిటల్ కు రమ్మంటుంది డాక్టర్. క్రాంతి వచ్చి ఏమైందని కంగారుగా అడుగుతాడు. అక్కడ విరాట్, చంద్రకళను చూస్తాడు క్రాంతి. మేం ఏదో చేసి శాలిని ప్రెగ్నెన్సీ పోగొట్టామని అనుకుంటున్నావు. నిజం నీకు తెలిసేలా చేసేందుకు ఇక్కడికి రప్పించామని విరాట్, చంద్ర అంటారు.

శాలిని ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంతా అబద్దం. ఇలా చెప్పాలని వీళ్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ శాలిని ప్రెగ్నెన్సీ 100 శాతం నిజం క్రాంతి అని డాక్టర్ చెప్పగానే విరాట్, చంద్రకళ షాక్ అవుతారు. చూశారా క్రాంతి ఎలా బెదిరిస్తున్నారో? పీక మీద కత్తి పెట్టి మీకు ఫోన్ చేయించారు. శాలిని ప్రెగ్నెన్సీ అబద్దమని చెప్పాలన్నారు. ప్రాణం పోతుందేమోనన్న భయంతో అలా చెప్పడానికి ఒప్పుకున్నా. కానీ మీరు వచ్చాకే నాకు ధైర్యం వచ్చింది. క్రాంతి...