భారతదేశం, డిసెంబర్ 8 -- నిన్ను కోరి సీరియల్ ఈ రోజు డిసెంబర్ 8 ఎపిసోడ్ లో డాక్టర్ గా ఊహించుకున్న రఘురాం పేషెంట్లను ట్రీట్ చేస్తాడు. కడుపు నొప్పి అంటే కళ్లు చూపించమని అంటాడు రఘురాం. అజీర్తి చేసిందని, నీళ్లలో చెంచాడు వాము, జీలకర్ర వేసి బాగా మరిగించి తాగమని చెప్తాడు. తెలుగులో ప్రిస్కిప్షన్ రాస్తాడు. మరోవైపు రఘురాం కోసం జగదీశ్వరి, శ్యామల వెతుకుతారు.

బేబీని కలవడానికి వెళ్లానని కామాక్షితో చెప్తుంది శ్రుతి. బేబీని గర్ల్ ఫ్రెండ్ అనుకోని కామాక్షి మాట్లాడుతుంది. మధ్యలో శాలిని వచ్చి పెళ్లి చేసుకుంటారని అనడంతో శ్రుతి షాక్ అవుతుంది. కానీ శాలిని మాట మారుస్తుంది. రోజు బేబీ బేబీ అని పరుగెత్తుతున్నావ్ కానీ ఒక్క సారి కూడా ఇంటికి ఎందుకు రాదు? అని కామాక్షి అడుగుతుంది. రఘురాం ఎక్కడ అని విరాట్, చంద్ర కూడా వెతుకుతారు. బెల్ మోగించిన రఘురాం మళ్లీ అంతా గుర్తుకు తె...