భారతదేశం, డిసెంబర్ 6 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం పిజ్జా ఆర్డర్ చేస్తాడు. క్రాంతి, విరాట్‌ను వచ్చి కూర్చోమంటాడు. ఇద్దరికి ఇస్తే తినరు. రఘురామే ఇద్దరికి పిజ్జా తినిపిస్తాడు. అందరికి ఇస్తారు. శ్రుతి మాత్రం పిజ్జా తినకుండా వెళ్లిపోతుంది. విరాట్, క్రాంతి సీరియస్‌గా ఉంటే ఏమైందిరా, గొడవ జరిగిందా అని రఘురాం నిలదీస్తాడు.

మళ్లీ ప్రాంక్ చేస్తున్నారా అని చంద్రకళ అంటుంది. దాంతో ఏం గొడవలు జరగనట్లు విరాట్, క్రాంతి నటిస్తారు. ఎంత బాగా నటిస్తున్నారా అని మనసులో అనుకున్న రఘురాం చిన్నప్పుడు వాళ్లు చేసిన అల్లరి గుర్తు చేస్తాడు రఘురాం. విరాట్‌కు కాల్ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లాలని అంటాడు.

క్రాంతి ఫోన్ వచ్చిందని వెళ్లిపోతాడు. రఘురాంకు ఏం గుర్తు లేదని కామాక్షి, శ్యామల మాట్లాడుకుంటుంటే తనకు అంతా గుర్తుందని రఘురాం అంటాడు. విరాట్, క్రాంతిని కలి...