భారతదేశం, డిసెంబర్ 5 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో కళ్లు తెరిచిన రఘురాం ఏం జరగనట్లుగా అన్నీ మర్చిపోయి మాట్లాడతాడు. ఈ రోజు నా పుట్టిన రోజా? అందరూ విష్ చేయండని అడుగుతాడు. రాత్రి ఏమైనా జరిగిందా? అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదని అందరూ అబద్దం చెప్తారు.

అందరిని వెళ్లిపోమ్మని చెప్తాడు రఘురాం. అప్పుడు అంత పెద్ద గొడవను తేలిగ్గా ఎలా మర్చిపోయానని చూస్తున్నావా?అంతా గుర్తుంది అని జగదీశ్వరికి షాక్ ఇస్తాడు రఘురాం. శాలిని కడుపు పోవడానికి కారణం నువ్వే అని క్రాంతి, కడుపులో బిడ్డ లేదని విరాట్ గొడవ పడ్డారు. తండ్రిగా ఆ ఇద్దరిని కలుపుతానని చెప్తాడు రఘురాం.

చంద్రకళ దగ్గరకు వచ్చి శాలిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మామయ్య మతిమరుపు నీకు వరం. ఆయనకు అన్ని గుర్తొచ్చిన రోజు నీ పాపం పండుతుందని చంద్ర అంటుంది. లేని ప్రెగ్నెన్సీని నువ్వే పొగొట్టావని డ్రామా ఆడాన...