భారతదేశం, డిసెంబర్ 4 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నేను నిజం దాచడం వల్ల నాన్న ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని విరాట్ అంటాడు. అసలు ఆరోజు నిన్ను తల మీద కొట్టింది శాలినినే. తన బండారం ఎక్కడ బయటపడుతుందేమో అని ప్రెగ్నెంట్ అని కొత్త నాటకం ఆడిందని విరాట్ అంటాడు. అసలు శాలినికి ప్రెగ్నెన్సీయే లేదు అని విరాట్ గట్టిగా చెబుతాడు.

మాటలు ఉంటే సరిపోతుందా. సాక్ష్యాలు ఉండక్కర్లేదా అని కామాక్షి అంటుంది. ఉంది అని విరాట్ రిపోర్ట్స్ చూపిస్తాడు. ఆ రిపోర్ట్స్ చూసి నిజమే అంటుంది కామాక్షి. రఘురాం మరింత స్ట్రెస్ అవుతాడు. అది అడ్వాంటేజ్‌గా తీసుకుని బయటపడదామని మరింత ఒత్తిడి పెంచుతుంది శాలిని. ఎమోషనల్ డ్రామా చేస్తుంది.

నా తల పగలిపోతుంది. నరాలు చిట్లుపోతున్నాయి. ఇంట్లో అంతా కలిసి ఉన్నారనుకున్నా. కానీ లేదు. నా వల్ల కావట్లేదు అని రఘురాం అంటాడు. మాట మాట పెరిగి తం...