భారతదేశం, డిసెంబర్ 30 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో ముంబయి ప్రాజెక్ట్ ఓకే కావడంతో క్రాంతిని తెగ పొగిడేస్తాడు విరాట్. చంద్ర కంగ్రాట్స్ చెప్తే క్రాంతి పట్టించుకోడు. క్రాంతికి స్వీట్ తినిపిస్తాడు విరాట్. రఘురాం కూడా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మానాన్నలకు స్వీట్ తినిపిస్తాడు క్రాంతి. విరాట్ కు కూడా ఇస్తాడు. అదంతా చూసి శాలినికి మండిపోతుంది. క్రాంతి మీటింగ్ కు ఆఫీస్ వెళ్లాలన్నావు కదా అని గుర్తు చేస్తుంది శాలిని.

చిన్న గుడిసె లాంటి రాజ్ ఇళ్లు చూసి శ్రుతి, కామాక్షి, శ్యామల షాక్ అవుతారు. రాజ్ పీక పట్టుకునేంత కోపం వస్తుంది శ్రుతికి. ఇంటిని చూడగానే నీ కూతురు కరెంట్ షాక్ తగిలిన కాకిలా అయిపోయిందని కామాక్షితో శ్యామల అంటుంది. ఎవరి తాహతుకు తగ్గట్లు వాళ్ల ఇల్లు ఉంటుంది. లేదంటే పుట్టింటి కట్నంగా పెద్ద ఇల్లు రాసి ఇవ్వండని సరోజా అంట...