భారతదేశం, డిసెంబర్ 3 -- నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో విరాట్ తోసేయడంతో శాలిని మెట్ల పై నుంచి పడిపోతుంది. కింద పడి దెబ్బ తగిలినా శాలిని డ్రామా కంటిన్యూ చేస్తుంది. శాలినిని హాస్పిటల్ కు తీసుకెళ్తారు. తను పడలేదు మెట్ల మీద నుంచి తోసేశారని క్రాంతి చెప్తాడు. కంగారు పడకురా అని క్రాంతికి చెప్తాడు విరాట్.

భరోసా ఇవ్వడానికి వచ్చావా? చంపడానికి వచ్చావా? అని విరాట్ పై సీరియస్ అవుతాడు క్రాంతి. జస్ట్ జ్యూస్ లో ఏదైనా కలిసిందని చెప్పమన్నా కానీ ఇంతలా దెబ్బ తగిలించుకున్నారు ఏంటీ అని డాక్టర్ అడుగుతుంది. శత్రువును దెబ్బ కొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తానని శాలిని నవ్వుతూ చెప్తుంది. బయట క్రాంతి ఎమోషనల్ అవుతాడు.

జ్యూస్ లో ఏం కలిపావని చంద్రకళపై ఫైర్ అవుతాడు క్రాంతి. తనేమో బిడ్డను చంపే ప్రయత్నం చేసింది. నువ్వేమో నా భార్యను చంపాలని చూశావని క్రాంతి అంటాడు. అం...