భారతదేశం, డిసెంబర్ 29 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 29 ఎపిసోడ్ లో సరోజా వెటకారంతో కామాక్షికి తిక్క రేగుతుంది. రాజ్ బద్ధకంగా నిద్రలేస్తాడు. శ్రుతి బెడ్ పై పడుకొని ఉంటాడు. మా మధ్య ఏం జరగొద్దని బయట తెలియొద్దని పడుకున్న శ్రుతి లిప్ స్టిక్, జుట్టును చిందర వందర చేసి బయటకు వస్తాడు రాజ్. అతణ్ని చూసి కామాక్షి కంగారు పడుతుంది.

గదిలోకి వెళ్లి శ్రుతిని నిద్ర లేపుతుంది కామాక్షి. రాత్రి ఏం జరగలేదు అమ్మ. అనుకున్నట్లు చితకబాదానని శ్రుతి చెప్తుంది. ఏం జరగకపోయినా, అన్నీ జరిగినట్లు రాజ్ నమ్మించాడని కామాక్షి చెప్తుంది. మరోవైపు రాత్రి శ్రుతి తనను చితక్కొట్టడం గురించి తల్లికి చెప్తూ బాధ పడతాడు రాజ్. ఇంత టార్చర్ ఎందుకు తట్టుకుంటున్నానో ఆలోచించు. నా టార్గెట్ అంత ఆస్తిలో వాటా. జగదీశ్వరి నమ్మేలా చేస్తేనే సక్సెస్ అవుతామని రాజ్ చెప్తాడు.

పూజ గదిలో శ్రుతి, ర...