భారతదేశం, డిసెంబర్ 25 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 25 ఎపిసోడ్ లో మా వాడితో శ్రుతి పెళ్లిలో చంద్రకళ తప్పు లేదు. మా అబ్బాయి శ్రుతిని ప్రేమించాడు. పెద్దవాళ్లు ఒప్పుకోరని గుడిలో పెళ్లి చేయించా. ఇందులో చంద్ర చేసిందేం లేదు. ఈ అమ్మాయి చాలా మంచిది. ఒక్కసారి క్షమించి చూడు అని విరాట్ కు చెప్తుంది సరోజా.

గదిలోకి వెళ్లిన విరాట్ ను సరోజాలా మాట్లాడుతూ చంద్రకళ ఆటపట్టిస్తుంది. అప్పుడే శాలిని రావడం చూసి తను ఇటువైపు రాకుండా చిన్న షాక్ ఇద్దామని చంద్ర ప్లాన్ చేస్తుంది. కరెంట్ వైర్ బయటకు పెట్టి స్విచ్ వేస్తుంది. అది చూసుకోకుండా డోర్ దగ్గరకు వచ్చిన శాలిని వైర్ మీద కాలు పెట్టడంతో షాక్ కొట్టి అరుస్తుంది. అందరూ కంగారుగా వస్తే బల్లి మీద పడితే అరిచానని కవర్ చేస్తుంది.

గోడలకు అతుక్కుని తిరగకు అని జగదీశ్వరి అంటే, కరెక్ట్ గా చెప్పారని చంద్రకళ అంటుంది. లోపల ఏ...