భారతదేశం, డిసెంబర్ 24 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి ప్లాన్ ప్రకారం రాజ్ కొట్టిన కొబ్బరికాయలో ఎర్ర నీళ్లు వస్తాయి. అది చూసి అంతా షాక్ అవుతారు. కామాక్షి, శ్రుతి డ్రామా చేస్తారు. నీతో వ్రతం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని కామాక్షి అంటుంది. దేవుడిగా మీకు ఇష్టం లేదా. ఇదంతా కామాక్షి, శ్రుతి డ్రామా ఆడుతున్నారు అని చంద్రకళ అంటుంది.

శ్రుతి మాట్లాడిన వ్యక్తిని తీసుకొచ్చి చంద్రకళ నిజం చెప్పమంటుంది. తనకు వెయ్యి రూపాయలు ఇచ్చి కెమికల్ కలుపుమన్నది చెబుతాడు. కానీ, ఇదంతా చంద్రకళే కావాలని ప్లాన్ చేసిందని కామాక్షి, శ్రుతి అంటారు. మళ్లీ అంతా చంద్రకళనే నిందిస్తారు. అసలు ఈ విషయం ముందు తెలిసింది మావయ్య గారికే. ఆయనే నాకు చెప్పారని చంద్రకళ అంటుంది.

కొబ్బరికాయ కొట్టిన సౌండ్‌కు మర్చిపోయిన రఘురాం నాకు గుర్తు లేదు అని అంటాడు. అన్నయ్య మతిమరుపును అ...