భారతదేశం, డిసెంబర్ 23 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 23 ఎపిసోడ్ లో మెడ పైనుంచి పువ్వుతో కొడతాడు విరాట్. సూపర్ గా ఉన్నావంటాడు. అమ్మానాన్న, క్రాంతి రావడం చూసి చంద్రపై సీరియస్ అవుతాడు విరాట్. మంచి మనసుతో చేస్తేనే వ్రతం ఫలిస్తుంది. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో నాకు తెలుసు. శ్రుతి పెళ్లి చేయించింది కదా. ఇప్పుడు హడావుడి చేస్తోందని విరాట్ అంటాడు.

విరాట్ పై రఘురాం ఫైర్ అవుతాడు. నోర్మూయ్.. మొన్నటి వరకు చంద్రకళతో బాగానే ఉన్నావు కదా. నువ్వే సపోర్ట్ గా మాట్లాడేవాడివి. అసలు ఏమైంది నీకు? అని అడుగుతాడు రఘురాం. మూసుకున్న కళ్లు తెరుచుకున్నాయి నాన్న. ఆమె చెప్పినట్లు ఆడి నా ఇష్టమైన వాళ్ల మనుసులు కష్టపెట్టానని విరాట్ అంటాడు. ఈ వ్రతం ఆపేయడమే మంచిదని కామాక్షి అంటుంది. వ్రతం జరగాల్సిందేనని శ్యామల చెప్తుంది.

చంద్ర కూడా డ్రామా చేస్తూ ఏడుస్తూ గదిలోకి వె...