భారతదేశం, డిసెంబర్ 22 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 22 ఎపిసోడ్ లో విరాట్ ముద్దు పెట్టబోతుంటే చంద్ర తోసేసి వెళ్లిపోతుంది. గదిలో కునికిపాట్లు పడుతున్న సరోజాపై రాజ్ ఫైర్ అవుతాడు. నువ్వు చెప్పిందేంటీ? చేస్తుందేంటీ? కనక మహాలక్ష్మి మన చేతికి అందాలంటే అడుగు ముందుకు వేయాల్సిందేనని తల్లిని కిందకు తీసుకొస్తాడు రాజ్.

శ్యామల దగ్గరకు వచ్చి పొగిడేస్తుంది సరోజా. పెళ్లి జరిగిపోయింది. ఎలా జరిగినా పెళ్లి పెళ్లే కదా. ఆ తర్వాత జరిగే తంతులన్నీ జరిపించాల్సిందే కదా అని సరోజా అంటుంది. మెల్లగా అజమాయిషీ చెలాయించి ఈ ఆస్తి దక్కించుకోవాలన్నదే కదా మీ ప్లాన్ అని శ్యామల అంటుంది. ఎప్పుడూ డబ్బు గురించే మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరే దగ్గరుండి మీ అమ్మాయి పెళ్లి జరిపించి ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు. మీకు ఆ డబ్బంతా ఆదా చేశామని సరోజా అంటుంది.

మూడు ముళ్లు పడ్డా...