భారతదేశం, డిసెంబర్ 20 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ దగ్గరికి వచ్చి ఏం యాక్టింగ్ చేశావ్ బావ అని పొగుడుతుంది. నువ్ మాత్రం నిజంగానే అన్నావ్‌గా. మనసులో ఇంత పెట్టుకున్నావా. ద్వేషంతో తాళి కట్టానని అన్నావ్ అని విరాట్ అలుగుతాడు. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తొక్క తీసేదాన్ని తొక్కలో గొడవలు ఎందుకు పెట్టుకుంటానని చంద్రకళ అంటుంది.

అంతా ఓకేకానీ శాలిని అంత త్వరగా నమ్మే వ్యక్తి కాదు అని విరాట్ అంటాడు. నువ్వు చేసిన ఓవరాక్షన్‌కు నమ్మకపోవచ్చు. ఇంకోసారి ట్రై చేయాలి. క్రాంతి మాత్రం కచ్చితంగా నమ్మే ఉంటాడు. కానీ, అది మార్చడానికి శాలిని ట్రై చేస్తుందని చంద్రకళ అంటుంది. తర్వాత క్రాంతి వచ్చినట్లు చంద్రకళ అంటే విరాట్ మళ్లీ నటిస్తాడు. అదంతా వట్టిదే అని చెప్పడంతో చంద్రకళను లాగుతాడు విరాట్.

ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. మరోవైపు కామాక్షి ఏడుస్తుంది. టి...