భారతదేశం, డిసెంబర్ 2 -- నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో నువ్వు మారడానికి నీకో అవకాశం ఇస్తున్నానని చంద్రకళ అంటుంది. వార్నింగ్ లు ఇవ్వకు చంద్ర అని శాలిని నవ్వేస్తుంది. నేను తలుచుకుంటే ఏం చేయగలనో మార్నింగ్ శాంపిల్ చూశావు కదా. నా జోలికి రాకపోవడమే మంచిది. నిజం తెలిస్తే నేను బయటకు పోతానేమో కానీ మామయ్య పైకి పోతారు. అలాంటి మనిషి నా కడుపులో వారసుడు లేడని తెలిస్తే ఏమైపోతాడని శాలిని అంటుంది.

క్రాంతి మీద కూడా నీకు ప్రేమ లేదు. అతని ఎమోషన్స్ ను వాడుకుంటున్నావు కదా. ఎన్ని రోజులు నాటకమాడుతావు. కడుపులో బిడ్డ లేడనే సంగతి ఎన్ని రోజులు దాస్తావు. ఇక నిన్ను క్షమించను శాలిని అని చంద్రకళ వెళ్లిపోతుంది. ఏదైనా జరిగిందా? అని విరాట్ అడుగుతాడు. ఆఫీస్ లో లెక్కలు కిందామీద అయ్యాయని చంద్ర అబద్ధం చెబుతుంది. విరాట్ వెంటనే ముద్దు పెడతాడు. ముద్దులు, హగ్గుల దగ్గరే మన స...