భారతదేశం, డిసెంబర్ 18 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో శ్రుతి తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ అబద్దం చెప్పలేదు. నేనే అబద్దం చెప్పానని రాజ్ అంటాడు. శాలిని మధ్యలో వచ్చి మళ్లీ చంద్ర మీదకు డైవర్ట్ చేస్తుంది. కామాక్షి వచ్చి నీ కళ్లు చల్లబడ్డాయా అని అంటుంది. ఇదంతా చంద్ర ఆడిన నాటకమే. వీళ్లంతా ఉసిగొల్పిన మనుషులే అని కామాక్షి అంటే, బుద్ధి ఉండాలని రఘురాం మధ్యలో చంద్రకు అండగా నిలుస్తాడు.

ఇది నిజంగా చంద్రకళ పనే. నిన్న జల్ రాజ్ నాకు డబ్బులు కావాలని అడిగాడు. అప్పుడే చంద్ర నాకు డబ్బులిచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమందని శ్రుతి చెప్తుంది. చంద్ర ఆఫీస్ కు వెళ్తుంటే నేనే పనసపొట్టు కూర చేయమన్నా. చంద్ర డబ్బులిచ్చి డిపాజిట్ చేయమని చెప్పిందని రఘురాం అంటాడు. అవును, చంద్ర ముందే ఆ డబ్బులు నన్ను అడిగిందని విరాట్ చెప్తాడు.

నేనే పరాయిదాన్ని. ఇదంతా అసలు పెళ్లే కాదు. ...