భారతదేశం, డిసెంబర్ 17 -- నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 17 ఎపిసోడ్ లో శ్రుతి మెడలో రాజ్ తాళి కడతాడు. మూడు ముళ్లు పడ్డ తర్వాత రాజ్, శ్రుతిని చంద్రకళ చూస్తుంది. దండలు మార్చుకునేటప్పుడు వచ్చి షాక్ అవుతుంది. రాజ్, శ్రుతి కూడా కంగారు పడతారు. ఎం పని చేశావ్ శ్రుతి, అతను చేపల బిజినెస్ చేస్తాడని చంద్ర చెప్తుంది. ఆ రోజు ఇంటికి నన్ను కలిసేందుకు అలా వచ్చాడని శ్రుతి చెప్తుంది.

నువ్వు చెప్పాకే రాజ్ నాకు పరిచయమయ్యాడు. ఇద్దరం లవ్ చేసుకున్నాడు. అమ్మ మా పెళ్లికి ఒప్పుకోదని అర్థమైంది. అందుకే ఇలా అని శ్రుతి చెప్తుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో? జగదీశ్వరి అత్తయ్య ఎలా రియాక్టవుతుందో ఆలోచించావా? అని చంద్రకళ అడుగుతుంది. రాజ్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ తెలిస్తే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారు అని శ్రుతి చెప్తుంది.

శాలినికి మధు ఫోన్ చేసి పెళ్లి...